Posts

Showing posts from 2025

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి - పెన్న అహోబిలం ,శ్రీ మహావిష్ణువు, రాక్షసుడిని సంహరించి మహర్షికి శాంతిని ఆంధిచిన ప్రదేశం

  శ్రీ లక్ష్మీ నరసింహస్వామి - పెన్న అహోబిలం అనంతపురం జిల్లా(anantpur), ఉరవకొండ మండలానికి సమీపంలో, పెన్నా నది ఒడ్డున గల ఒక ప్రాచీన దేవస్థానమే పెన్న అహోబిలం. అనంతపురం నుండి సుమారు నలభై కిలోమీటర్ల(40 km) దూరంలో, బళ్ళారి మార్గంలో గల ఈ ఆలయం, భక్తులకు విశేష ప్రాధాన్యత కలిగి ఉంది. శ్రీ నరసింహస్వామి స్వయంభువుగా వెలిసిన క్షేత్రమని, ఆయన కుడిపాద ముద్ర ఇక్కడ కనిపిస్తుందని భక్తుల నమ్మకం. అదే విధంగా, నరసింహస్వామి మరో పాదాన్ని అహోబిలం లో ఉంచి, భక్తులను అనుగ్రహిస్తున్నారని చెబుతారు. చరిత్ర ప్రకారం, విజయనగర సామ్రాజ్యానికి చెందిన సదాశివరాయలు ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో నిర్మించినట్లు సమాచారం. ఆలయ ప్రాంగణంలో స్వామివారి పాదముద్ర ఉన్న స్థలంలో ఒక చిన్న బిలం ఉంది. ఈ బిలం ద్వారా స్వామివారికి అభిషేక జలం అంతర్వాహినిగా ప్రవహించి, మూడు కిలోమీటర్ల దూరంలోని మాన్నానదిలో కలిసిపోతుంది. ఈ విశేషం కారణంగా, ఈ స్థలాన్ని "పెన్న అహోబిలం" అని పిలుస్తారు. స్థల పురాణం: ఈ ప్రదేశం ఒకప్పుడు అరణ్యభూమిగా ఉండేది. ఇక్కడ ఉద్దాలక మహర్షి తపస్సు చేసేవారని పురాణ కథనాలు చెబుతున్నాయి. మహర్షి ప్రతిరోజు పెన్నా నదిలో స్నానం చేసి, ఒక పె...

గయాక్షేత్రం - గయ

 భారతదేశంలోని ప్రముఖ పవిత్ర స్థలాల్లో ఒకటైన గయ బీహార్ రాష్ట్రం, గయా జిల్లాలో ఉంది. ఇది తూర్పు మధ్య రైల్వేలో గ్రాండ్ కార్డ్ లైన్‌లో ఉన్న ముఖ్యమైన రైల్వే జంక్షన్. హిందువుల కోసం విశేషమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన ఈ ప్రదేశం, వేదకాలం నుంచే అత్యంత పవిత్రంగా గుర్తించబడింది. త్రిస్థలి మహత్యం: ప్రయాగ, కాశీ, గయ అనే మూడు పవిత్ర క్షేత్రాలను కలిపి "త్రిస్థలి" అని అంటారు. భక్తుల నమ్మిక ప్రకారం, ఈ మూడు ప్రదేశాలను ఒక్కసారి దర్శిస్తే మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేయడం మోక్షసాధనకు ముఖ్యమైన చర్యగా భావించబడుతుంది. ఈ ప్రాంతంలో పాత గయ, క్రొత్త గయ అనే రెండు భాగాలుగా గయా ఉంది. స్థలపురాణం: పురాణ కథనాల ప్రకారం, గయాసురుడు అనే రాక్షసుడు గయక్షేత్రానికి పేరుగాంచిన ప్రాణి. విష్ణుభక్తుడైన గయాసురుడు గొప్ప తపస్సు చేసి, తనను ఎవరు తాకినా వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని ఓ మహావరం పొందాడు. అయితే, అందరూ గయాసురుని తాకడం వల్ల యమధర్మరాజు పనిలేకుండా పోయాడు. దీనివల్ల కలిగే ప్రభావాన్ని అరికట్టడానికి, బ్రహ్మదేవుడు గయాసురుని దగ్గరకు వెళ్లి, తాను యజ్ఞం చేయాలనుకుంటున్నానని...

రాహుగ్రహ దేవాలయం - తిరునాగేశ్వరం :ఇది భారతదేశంలో ప్రత్యేకంగా రాహుగ్రహ మూర్తి కోసం నిర్మించబడిన అతిపెద్ద ఆలయం

  కుంభకోణానికి 5 k.m  దూరంలో ఉన్న తిరునాగేశ్వరం గ్రామంలో ప్రాచీనమైన రాహు గ్రహ ఆలయం ఉంది. ఇది భారతదేశంలో ప్రత్యేకంగా రాహుగ్రహ మూర్తి కోసం నిర్మించబడిన అతిపెద్ద ఆలయం. ఈ ఆలయంలోని ప్రధాన దేవతను భక్తులు "నాగనాథన్" అనే పేరుతో పూజిస్తారు. ఈ పవిత్ర క్షేత్రంలో రాహువు పరమేశ్వరుని భక్తితో ప్రార్థించి, ఆయన దర్శనం పొందాడని చెబుతారు. ఈ కారణంగా ఈ స్థలానికి తిరునాగేశ్వరం అనే పేరు వచ్చింది. పురాణాల ప్రకారం, నలుడు, గౌతమ మహర్షి, పంచపాండవులు, పరశురాముడు, ఇంద్రుడు, సూర్యదేవుడు వంటి మహర్షులు, దేవతలు ఇక్కడ పూజలు నిర్వహించినట్టు చెబుతారు. ఈ ఆలయంలో భక్తులకు ప్రత్యేకంగా రాహుగ్రహానికి సంబంధించిన పూజా సామగ్రి, వెండితో చేసిన నాగపడగలు లభిస్తాయి. ప్రతిరోజూ రాహుకాల సమయంలో రాహు దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఆలయ గోపురానికి బంగారు ఆవరణం ఉండటం వల్ల ఇది కాశీలోని విశ్వేశ్వరస్వామి ఆలయాన్ని తలపిస్తుంది. ఈ దేవాలయంలో ఒక ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే, రాహుకాల సమయంలో మాత్రమే క్షీరాభిషేకం  చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆ సమయంలో పాలను రాహు మూర్తి శిరస్సుపై పోస్తే, అవి కంఠభాగాని...

4778 మీటర్ల ఎత్తులో సహజసిద్ధంగా ఏర్పడిన ఒక సరస్సు : రూపకుండ్

Image
  ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర హిమాలయాల్లో(north himalayas), కుమావున్ శిఖర శ్రేణుల్లో, సముద్ర మట్టానికి 4,778 Met ఎత్తులో ఒక ప్రకృతిసిద్ధమైన సరస్సు ఉంది. ఇది యాత్రికులచే ఎంతో పవిత్రంగా భావించబడే జలాశయం. ఈ సరస్సు రూపకుండ్ గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 12 ఏళ్లకోసారి పుష్కరాల వంటి విశేషమైన ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. రూపకుండ్ సరస్సుకు వెళ్లే యాత్రను ‘రాజ్ జయయాత్ర’ అని పిలుస్తారు. ఈ యాత్ర కర్ణప్రయాగ సమీపంలోని సవతీ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రకు సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన కధయూ ప్రాచుర్యంలో ఉంది. సవతీ గ్రామం నుంచి యాత్రికులు బయలుదేరినప్పుడు, ఓ నాలుగు కొమ్ములుగల అడవి గొర్రె వారి ముందు ప్రత్యక్షమై మార్గదర్శకంగా మారుతుంది. భక్తులు దాన్ని దైవస్వరూపంగా భావించి, అది చూపించే దారిలోనే ప్రయాణిస్తారు. యాత్రికులను రూపకుండ్ సరస్సు మీదుగా నందాదేవి ఆలయం వరకు తీసుకెళ్లాక, ఆ గొర్రె కనిపించకుండా మాయమవుతుంది. యాత్ర ప్రారంభానికి ముందు, నందాదేవి బంగారు విగ్రహాన్ని వెండి పల్లకిలో ప్రతిష్టిస్తారు. యాత్రికులు ఆ పల్లకీని మోసుకుంటూ, ఆ గొర్రె వెనుకే సాగిపోతారు. అలా, న...

శ్రీ రాముని అరణ్యవాస ప్రదేశం - చిత్రకూట్,

  చిత్రకూట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది అలహాబాద్ నుండి 90 k.m దూరంలో, సతనాకు 68 k.m. ఉత్తరంగా ఉంది. ఈ ప్రాంతం ప్రత్యేకమైనది, ఎందుకంటే దీని కొన్ని భాగాలు ఉత్తరప్రదేశ్‌లో, మరికొన్ని మధ్యప్రదేశ్‌లో ఉంటాయి. అయితే, ఎక్కువ మంది దర్శించే పవిత్ర స్థలాలు ప్రధానంగా మధ్యప్రదేశ్‌లోనే ఉన్నాయి.ఇతిహాసం ప్రకారం, శ్రీరాముడు తన 14 ఏళ్ల అరణ్యవాస కాలంలో 11 సంవత్సరాలు చిత్రకూట్‌లోనే గడిపాడు. సీతా, లక్ష్మణులతో కలిసి ఇక్కడ నివసించిన కారణంగా, ఈ ప్రదేశం అత్యంత పవిత్రంగా మారింది.చిత్రకూట్‌లోని ప్రధాన రహదారి నుంచి తూర్పు వైపు ఒక వీధి ఉంది. ఈ వీధి చివరికి వెళితే మందాకినీ నది కనిపిస్తుంది. ఈ నది చిత్రకూట్‌ను రెండు భాగాలుగా విభజిస్తుంది. పురాణాల ప్రకారం, ఒకప్పుడు ఈ ప్రాంతం తీవ్రమైన ఎండలు, వర్షాభావంతో బాధపడుతుండగా, అనసూయాదేవి తన తపోశక్తితో శివుని ప్రార్థించి గంగను భూలోకానికి తీసుకురావడంతో ఈ నది ఉద్భవించిందని చెబుతారు. అందుకే ఈ నదిని మందాకిని అని పిలుస్తారు. రామ్ ఘాట్ మందాకినీ నది సుమారు 100 గజాల వెడల్పు కలిగి ఉంది. నది రెండు వైపులా సిమెంట్ మెట్లు నిర్మించబడ్డాయి, వీటిని రామఘాట్ అని అంటారు. అరణ్యవాస కాలంలో శ...

బిజిలీ మహాదేవ్ - హిమాచల్ ప్రదేశ్: ఇక్కడ తరచూ శివలింగం పిడుగులకు పగిలిపోతుంది

 హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా, కులూ పట్టణానికి దాదాపు 11 km. దూరంలో బిజిలీ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ పవిత్ర స్థలం బియాస్, పార్వతి నదుల సంగమ ప్రాంతంలో, సముద్ర మట్టానికి 2,455 m  ఎత్తులో వెలసింది. ఈ ఆలయానికి విశేషమైన ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ స్వామి భక్తులను కష్టకాలంలో కాపాడతాడని స్థానిక ప్రజలు గట్టి నమ్మకం కలిగి ఉంటారు. ఈ ఆలయానికి సంబంధించి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తరచుగా ఉరుములు, మెరుపులతో ఆకాశం భయంకరంగా మారిపోతుంది. ముఖ్యంగా, ఆలయ సమీపంలోని 60 అడుగుల ధ్వజస్తంభంలో ఉన్న ఇనుప ఊచ ద్వారా పిడుగులు ఆకర్షితమవుతాయి. ఈ ప్రక్రియలో విద్యుత్ శక్తి నేరుగా శివలింగంపై పడుతుంది, ఫలితంగా శివలింగం పగిలిపోతుంది. ఆలయ పూజారులు ఆ శివలింగాన్ని తెల్లని సిమెంట్తో తిరిగి అమర్చుతారు. ఋగ్వేదంలో వర్ణించిన కథ ప్రకారం, వశిష్ఠ మహర్షి శంకరునిలో నిక్షిప్తమైన భయంకరమైన విద్యుత్ శక్తిని ఉపసంహరించి, మానవాళికి రక్షణ కల్పించమని ప్రార్థించారని చెబుతారు. ఆలయంలో స్వామివారికి ఎదురుగా రెండు నందీలు ఉంటాయి. ఈ ఆలయం పగోడా ఆకారంలో నిర్మించబడి ఉండటం వల్ల అది బౌద్ధ ఆలయ నిర్మాణశైలిని గుర్తుకు తెస్తుంది. ఇక్కడ స్థాపితమైన శివ...

సమర్ధ రామదాసు ఆలయం-సజ్జనగడ్: సజ్జనగర్ శివాజీకి గురువుగారైన సమర్థ రామదాసు నిర్మించిన ఆలయము

Image
  మహారాష్ట్రలోని సాతారా పట్టణానికి 18 కి.మీ. దూరంలో సజ్జనగడ్ అనే ప్రదేశం ఉంది. ఇది ఊరిగా కాకుండా, ఒక కొండపై ఉన్న పవిత్ర స్థలంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ సమర్థ రామదాసు స్వయంగా నిర్మించిన సీతారామాలయం మరియు సమర్థ పీఠం ఉన్నాయి. సజ్జనగడ్‌ లో ప్రధానంగా రామాలయం ఉంది, ఇది రెండు అంతస్థులుగా రూపొందించబడింది. మొదటి అంతస్థులో సీతారామలక్ష్మణుల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి, రెండవ అంతస్థులో సమర్థ రామదాసు ఆలయం ఉంది. ఆలయానికి ముందుభాగంలో ఒక మంటపం (హాలు) ఉంటుంది. ఆలయ సమీపంలో చిన్న ఉద్యానవనం, పెద్ద కోనేరు కూడా ఉన్నాయి. కోనేరు చుట్టూ రాతిగోడలు, మెట్లు నిర్మించబడ్డాయి. సమర్థ రామదాసు, ఛత్రపతి శివాజీ మహారాజుకు గురువుగా పేరుపొందారు. ఆయన 1607లో మహారాష్ట్రలోని జాల్నా జిల్లా, జింబ్ గ్రామంలో జన్మించారు. 1649లో సింహగడ్‌లో శివాజిని కలుసుకొని, ఆయనకు ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా మారారు. 1680లో శివాజీ మరణించిన తర్వాత, రామదాసు ఆయన కుమారుడు శంభాజీకి ఆశీర్వాదమిచ్చి గద్దెపై కూర్చుండబెట్టారు. 1682లో, సజ్జనగడ్ కొండపై సీతారామాలయాన్ని నిర్మించి, తంజావూరు నుంచి విగ్రహాలను తెప్పించి ప్రతిష్టించారు. అదే సంవత్సరంలో, జనవరి 22న,...

పరశురాముడు ఏర్పరచిన విధానాల మేరకు మహాదేవుణ్ణి ఈ ఆలయంలో ఉదయాన్నే దక్షిణామూర్తిగానూ, మధ్యాహ్నంవేళ కిరాతమూర్తిగానూ, సాయంకాలం సచ్చిదానందమూర్తిగానూ కొలుస్తారు

 కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో, ప్రఖ్యాత పుణ్యక్షేత్ర ప్రాంతంలో వెలసిన వైకోమ్ మహాదేవుని దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో కొలువుదీరిన స్వామిని వైకతప్పన్ అని ముద్దుగా పిలుస్తారు. ఈ క్షేత్రంలో పూజలందుకుంటున్న శివలింగం త్రేతాయుగం నాటిదిగా భావించబడుతున్నది. ఈయనను అన్నదాన ప్రభువుగా కొలుస్తారు. స్వామికి గల మరోపేరు కరుణాస్వరూపు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎటువంటి ప్రభుత్వ శాసనాలూ అమలులోకి రాకముందునుంచే శైవ మరియు వైష్ణవ మతములవారే కాకుండా అన్ని కులాలవారూ దర్శించుకోవచ్చునని ఆచారంగా చేయబడింది. ఇక్కడ శివుడు కూడా తమతో కలిసి కూర్చొని భోంచేస్తాడని ఇక్కడి భక్తుల నమ్మకం. ఒకప్పుడు ఈ స్వామి వారు ఆలయం లేకుండా మోకాలులోతు నీటిలో ఉండేవాడట. ఈ దారి వెంట వెళ్తున్న పరశురాముడు వెలుగులు విరజిమ్ముతున్న దక్షిణామూర్తిని తెలుసుకొని ఆ స్వామికి గుడి కట్టించి, పూజా విధానాలనూ ఏర్పరచాడని తెలియుచున్నది. పరశురాముడు ఏర్పరచిన విధానాల మేరకు మహాదేవుణ్ణి ఈ ఆలయంలో ఉదయాన్నే దక్షిణామూర్తిగానూ, మధ్యాహ్నంవేళ కిరాతమూర్తిగానూ, సాయంకాలం సచ్చిదానందమూర్తిగానూ కొలుస్తారు. శివుడు అభిషేకప్రియుడు కనుక ప్రతినిత్యం ఈ స్...