4778 మీటర్ల ఎత్తులో సహజసిద్ధంగా ఏర్పడిన ఒక సరస్సు : రూపకుండ్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర హిమాలయాల్లో(north himalayas), కుమావున్ శిఖర శ్రేణుల్లో, సముద్ర మట్టానికి 4,778 Met ఎత్తులో ఒక ప్రకృతిసిద్ధమైన సరస్సు ఉంది. ఇది యాత్రికులచే ఎంతో పవిత్రంగా భావించబడే జలాశయం. ఈ సరస్సు రూపకుండ్ గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 12 ఏళ్లకోసారి పుష్కరాల వంటి విశేషమైన ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. రూపకుండ్ సరస్సుకు వెళ్లే యాత్రను ‘రాజ్ జయయాత్ర’ అని పిలుస్తారు. ఈ యాత్ర కర్ణప్రయాగ సమీపంలోని సవతీ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది.
ఈ యాత్రకు సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన కధయూ ప్రాచుర్యంలో ఉంది. సవతీ గ్రామం నుంచి యాత్రికులు బయలుదేరినప్పుడు, ఓ నాలుగు కొమ్ములుగల అడవి గొర్రె వారి ముందు ప్రత్యక్షమై మార్గదర్శకంగా మారుతుంది. భక్తులు దాన్ని దైవస్వరూపంగా భావించి, అది చూపించే దారిలోనే ప్రయాణిస్తారు. యాత్రికులను రూపకుండ్ సరస్సు మీదుగా నందాదేవి ఆలయం వరకు తీసుకెళ్లాక, ఆ గొర్రె కనిపించకుండా మాయమవుతుంది.
యాత్ర ప్రారంభానికి ముందు, నందాదేవి బంగారు విగ్రహాన్ని వెండి పల్లకిలో ప్రతిష్టిస్తారు. యాత్రికులు ఆ పల్లకీని మోసుకుంటూ, ఆ గొర్రె వెనుకే సాగిపోతారు. అలా, నందాదేవి ఆలయాన్ని దర్శించి తమ పవిత్ర యాత్రను పూర్తి చేస్తారు..
.jpg)
Comments
Post a Comment